పరారీలో పిన్నెల్లి సోదరులు ఉన్నారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు అయింది. A6గా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, A7గా వెంకట్రామిరెడ్డిపై సెక్షన్ 302 కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు పోలీసులు. హత్యలు జరిగిన ముందు రోజు వరకు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.

హత్యలు జరిగిన అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయినట్లు గుర్తించారు పోలీసులు. గత సంవత్సర కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు పి న్నె ల్లి వెంకట్రామిరెడ్డి. ఇక అటు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కు ఊహించని షాక్ తగిలింది. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్టు అయ్యాడు. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని బెంగుళూరులో అరెస్టు చేసి నెల్లూరుకు తరలించారు పోలీసులు. ఇక ఇవాళ వెంకటగిరి కోర్టులో కాకాణిని హాజరుపర్చనున్నారు పోలీసులు.