కరోనా వైరస్ రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఎక్కడిక్కడ కఠిన చర్యలు తీసుకుంటుంది కెసిఆర్ సర్కార్. వ్యాధి విస్తరించకుండా ఉండేందుకు గాను ఇప్పటికే రాష్ట్రంలో విదేశీయుల మీద నిఘా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కరీంనగర్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దీనితో అక్కడి తీవ్రతను వైద్య ఆరోగ్య శాఖా ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.
ఇక తెలంగాణా ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు ముమ్మరం చేసింది. ఆయన ఉన్నత అధికారులతో కాసేపట్లో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారులను అడిగి ఆయన పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఎక్కడిక్కడ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే తెలంగాణా ప్రభుత్వం నుంచి కాసేపట్లో కీలక ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.
అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు రవాణా మార్గాలను మూసి వేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది, ఏపీ మినహా సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని నిలిపివేయాలని, ఇతర రాష్ట్రాల వారిని రాష్ట్రంలోకి రానీయవద్దని కెసిఆర్ ప్రకటన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కరీంనగర్ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలని కూడా మూసివేయాలని ఆదేశించే అవకాశాలు కనపడుతున్నాయి.