టీడీపీ యువనేత పరిటాల శ్రీరాం ని అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయనపై పోలీసులు పలు కేసులు నమోదు చేసారు. ఇటీవల దూకుడుగా ఉన్న శ్రీరాం ని కట్టడి చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలోనే పోలీసులు ఆయనపై పలు కేసులు నమోదు చేసారు, రామగిరి,బత్తుల పల్లి సహా పలు స్టేషన్ లలో ఆయనపై కేసులు నమోదు చేసారు పోలీసులు.
బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, రామగిరిలో ప్రసంగించారంటూ మరో కేసు నమోదు చేసారు పోలీసులు. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల ఆయన పార్టీ మారతారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే తాను పార్టీ మారేది లేదని ఆయన సోషల్ మీడియాలో స్పష్టంగా చెప్పారు.
జేసి దివాకర్ రెడ్డి కి పార్టీలో ప్రాధాన్యత లభిస్తుందని భావించిన ఆయన అసహనంగా ఉన్నారని అందుకే రాజీనామా చేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల మీద పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన జేసి బ్రదర్స్ ఆర్ధిక మూలాల లక్ష్యంగా ప్రభుత్వం కేసులు పెడుతుందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.