సినిమా థియేటర్ల వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ప్రజలు సినిమా థియేటర్లకు రావాలంటే తినుబండారాలు, శీతల పానీయాలు, వాటర్ బాటిల్స్ ధరలను నియంత్రించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో విడుదలయ్యే ఏ సినిమా అయినా, అది నా హరిహర వీరమల్లు అయినా సరే వ్యక్తిగతంగా నిర్మాత ఒకరు రావడం కాదు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఇటీవల సంచలనంగా మారిన థియేటర్ల బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి.. జనసేన వాళ్ళు ఉన్న శిక్షించాలని ఆదేశించారు.