కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు క్షమించరానివి అని వెల్లడించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు. బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే విధంగా ఆమె వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

కవితకు అంత ఆవేశం ఎందుకు? కొంచెమైనా ఓపిక ఉండాలని వెల్లడించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు. లేఖ లీక్ అంశంపై కేసీఆర్ మాట్లాడతారు కదా? అంత తొందర ఎందుకు? అని మండిపడ్డారు. కేసీఆర్ మీకే కాదు లక్షలాది మంది ప్రజలకు కూడా కేసీఆర్ దేవుడు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.
–