తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుకు ఘోర అవమానం జరిగింది. ఆయన పుట్టినరోజు నాడే… హైదరాబాద్ గడ్డపై… హరీష్ రావును కించపరిచేలా చేశారు. ఇవాళ.. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గులాబీ నేతలు.

అయితే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు… తెలంగాణ భవన్ వద్ద ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు బర్త్డే ఫ్లెక్సీలు తొలగించినట్లు చెబుతున్నారు. ఇక దీనిపై గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ భవన్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు బర్త్ డే రోజు ఫ్లెక్సీలు తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది
మండిపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు pic.twitter.com/4zXIyaRdib
— Sarita Avula (@SaritaAvula) June 3, 2025