సహజంగా ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఆర్థిక అవసరాల కోసం కొన్ని రకాల లోన్స్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా అటువంటి సమయంలో పర్సనల్ లోన్ తీసుకోవడం పై అందరూ ఆసక్తి చూపుతారు. అయితే పర్సనల్ లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి, పూర్తి వివరాలు తెలియకుండా లోన్ తీసుకోవడం వలన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒత్తిడి ఎక్కువవుతుంది, దీంతో ఎటువంటి ఆలోచన చేయకుండా లోన్ కోసం దరఖాస్తు చేస్తుంటారు.
కానీ, పర్సనల్ లోన్ తీసుకునే ముందు క్రెడిట్ అర్హత ఉండాలి. రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే లోన్ పొందే అవకాశం ఉంటుంది. 300 నుండి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే, ఎంత త్వరగా లోన్ పొందవచ్చు. పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో చివరి గడువుకు ముందే బకాయిలను చెల్లించే విధంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో గడువు తేదీకి ముందే తీసుకున్న రుణాన్ని తిరిగి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కనుక, ప్రీ-పేమెంట్ లేదా ఫోర్-క్లోజ్కు సిద్ధంగా ఉన్నట్లయితేనే రుణాన్ని తీసుకోవాలి.
రుణాన్ని తీసుకున్న తర్వాత బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెల కొంత డబ్బు డిడక్ట్ అవుతుంది. ఆటో-డెబిట్ ఎంపికను తీసుకున్నప్పుడు, బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండేలా చూసుకోవాలి. పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు ఫిక్స్డ్ లేదా వేరియబుల్ రేట్ గురించి తెలుసుకోవాలి. వేరియబుల్ వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంటుంది, కానీ ఫిక్స్డ్ వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. కనుక వీటి గురించి అవగాహన పొంది, ఆ తర్వాతే లోన్ కోసం దరఖాస్తు చేయాలి. ఇలా చేయడం వలన ఎటువంటి సమస్యలు లేకుండా లోన్ ను తిరిగి సరైన సమయంలో చెల్లించగలరు.