Donald Trump’s new scheme: డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం ప్రారంభించబోతున్నారు. బిడ్డ పుట్టగానే వెయ్యి డాలర్లు జమ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం ప్రారంభించారు. అమెరికాలో పుట్టిన పిల్లల పేరిట వెయ్యి డాలర్లు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ట్రంప్. సోషల్ సెక్యూరిటీ వర్క్ ఆమోదం లేని చిన్నారులకు ఈ పథకం నుంచి మినహాయించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్.

కాగా, 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా నిషేధించిన జాబితాలో అఫ్గానిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలు ఉన్నాయి.
మరో ఏడు దేశాలపై కూడా పాక్షిక నిషేధం విధించారు. జూన్ 9వ తేదీ నుంచి అమల్లోకి నిషేదాజ్ఞలు రానున్నాయి. ఇక 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి, ఫైర్ అవుతున్నాయి ఇతర దేశాలు.