బీహార్ రాష్ట్రం కైమూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరుగుతుండగా హైడ్రామా జరిగింది. వధువు నుదిటిన సింధూరం పెడుతుండగా వరుడి చేతూ వనికింది. దానికి గమనించిన పెళ్లికూతురు అబ్బాయి పిచ్చివాడని అతడిని వివాహం చేసుకోనని అందరి ముందు తేల్చి చెప్పేసింది. దీంతో వరుడి తండ్రి తాము ఇచ్చిన లక్ష రూపాయల కట్నం తిరిగి ఇచ్చేయాలని కోరాడు. దీంతో వధువు తల్లిదండ్రులు లక్ష రూపాయలు ఖర్చు అయిపోయాయని, మేము ఇవ్వలేమని ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు.

దీంతో వరుడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించగా…. పోలీస్ స్టేషన్ లో కూడా వధువు కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని వెల్లడించారు. దీంతో చేసేది ఏమీ లేక వధువు వరుడి కుటుంబ సభ్యులు ఎవరి ఇంటికి వారు చేరిపోయారు. వారి డబ్బులను తిరిగి ఇచ్చేయాలని వరుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని మోసం చేసి వివాహానికి ఒప్పించారని, అబ్బాయి పిచ్చివాడని వధువు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.