పర్సనల్ లోన్ రీపేమెంట్ సులభం అవ్వాలంటే.. వీటిని తెలుసుకోవాల్సిందే..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఖర్చుల కోసం ఇతరుల నుండి అప్పు తీసుకోవడం, పర్సనల్ లోన్స్ వంటి వాటిని ఎంపిక చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే క్రమంగా వీటిని తీసుకోవడం వలన లోన్ పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి, పైగా తిరిగి పే చేసేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఖర్చులన్నీ పెరగడం వలన చాలా శాతం మంది పర్సనల్ లోన్స్ పై ఆధారపడుతూ ఉంటున్నారు. కాకపోతే వీటిని తీర్చేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

అయితే, మీ జీతం ప్రకారం మాత్రమే లోన్ తీసుకోవాలి. పరిమితికి మించిన లోన్ తీసుకోవడం వలన చెల్లించే సమయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక, లోన్స్ ను తీసుకునే ముందు ఎన్నో విషయాలను ముందుగా తెలుసుకొని, అప్పుడే లోన్ తీసుకోవాలి. మీరు తీసుకున్న లోన్ కు సంబంధించి ఈఎంఐను చెల్లింపు చేయగలనా, మీ లోన్‌కు సంబంధించిన ఈఎంఐను ప్రతి నెల పే చేయగలరా అని అనుకుంటేనే లోన్ తీసుకోవాలి లేకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. బడ్జెట్ మరియు ఖర్చులు మొత్తం సిద్ధం చేసుకుని, ఆ తర్వాతే లోన్ తీసుకోవాలి.

ఇలా చేయడం వలన సకాలంలో లోన్ తిరిగి పే చేయగలుగుతారు. అంతేకాకుండా, జీతం వచ్చిన వెంటనే ముందుగా ఈఎంఐ చెల్లించాలి. ఎప్పుడైతే ఈఎంఐలో పెండింగ్ ఉంటుందో, బౌన్స్ చార్జీలు పే చేయాల్సి ఉంటుంది. కనుక, అటువంటి చార్జీల నుండి తప్పించుకోవాలంటే సరైన సమయానికి ఈఎంఐను చెల్లించాలి. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వలన ఒకటి కంటే ఎక్కువ రుణాలను తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా, మీ జీతం ప్రకారం మాత్రమే రుణాలను తీసుకోవాలి. అంతేకాకుండా, ఎక్కువ రుణాలను తీసుకున్నప్పుడు పర్సనల్ లోన్‌ లో మార్చుకొని ఒక లోన్‌ నే తీసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news