జనతా కర్ఫ్యూకి సహకరిస్తున్న తెలంగాణా ప్రజలు…!

-

అవును తెలంగాణా ప్రజలు జనతా కర్ఫ్యూ ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఇలా ఎక్కడ చూసినా సరే ప్రజలు బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ ని అన్ని విధాలుగా విజయవంతం చేస్తున్నారు. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలను కూడా మూసి వేసారు.

తెలంగాణా వ్యాప్తంగా అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక తెలంగాణా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అన్ని రవాణా సౌకర్యాలను ఆపివేశారు. సరిహద్దులను కూడా తెలంగాణా ప్రభుత్వం మూసి వేసింది. కర్ణాటక, మహారాష్ట్ర కు వెళ్ళే రోడ్డు మార్గాలను మూసి వేసారు. ఆర్టీసి బస్సులు అన్నీ కూడా డిపోలకు మాత్రమే పరిమితం అయ్యాయి. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్… 24 గంటలు జనతా కర్ఫ్యూ అనగానే ప్రజలు రెడీ అన్నారు.

ఎలా అయినా సరే వైరస్ ని పూర్తి స్థాయిలో తెలంగాణా నుంచి తరిమి కొట్టడానికి అన్ని విధాలుగా ప్రజలు సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో 21 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అన్ని రైళ్ళను మూసి వేసారు అధికారులు. అలాగే మెట్రో రైల్ సర్వీసులను కూడా నిలిపివేశారు. జనతా కర్ఫ్యూ ని బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలను కూడా మూసి వేసారు. ఒక రోజుకి సరిపడా సరుకులు అన్నీ కూడా కొనుగోలు చేసుకుని పెట్టుకున్నారు. హైదరాబాద్ లో అన్ని సూపర్ మార్కెట్ లు శనివారం నాడు బిజీ గా కనిపించాయి. రవాణా వ్యవస్థపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి పది గంటల వరకు అన్ని రకాల రైళ్ళ ను బంద్ చేసారు. స్వచ్చందంగా హోటల్స్ ని కూడా మూసి వేసారు.

Read more RELATED
Recommended to you

Latest news