వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు. గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో విజయవాడ జైలు నుంచి ఆస్పత్రికి చెవిరెడ్డి తరలించారు. దింతో ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్యులు.

సాయంత్రం వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు సమాచారం అందుతోంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి గుండె పోతూ వచ్చినట్లు చెబుతున్నారు. ఇక అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు రిమాండ్ విధించారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.