తిత్లీ తుపాను.. నార్త్ ఆంధ్రా, సౌత్ ఒడిశాను అతలాకుతలం చేసేస్తోంది. భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అస్తవ్యస్తం అయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిరాశ్రయులను శిబిరాలకు తరలిస్తున్నారు. తిత్లీ తుపాను బీభత్సం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. ఇదే సమయంలో మరో తుపాను బీభత్సం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే హాంగ్‌కాంగ్‌లో వచ్చిన మాంగ్‌ఖుట్ తుపాను. దాని బీభత్సం అంతా ఇంతా కాదు. తిత్లీకి తాత అది. ఆ తుపాను.. గత నెలలో వచ్చింది. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు హాంగ్‌కాంగ్‌ను అతలాకుతలం చేసింది ఆ తుపాను. దానికి సంబంధించిన వీడియో ఇదే.
తిత్లీ తుపాను సరే.. ఈ మాంగ్‌ఖుట్ తుపాను బీభత్సం చూడండోసారి..!
-