మామిడిపండుతో మోమోస్ ఏంట్రా బాబు..? వీడియో వైరల్..!

-

రోజు రోజుకి కొత్త కొత్త ఆహార పదార్థాలు పుట్టుకొస్తున్నాయి. అందులో సోషల్ మీడియా ఈ రోజుల్లో పరిగెడుతుండడంతో ప్రతి ఒక్కరు కూడా వింతలు, వెరైటీలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా కొత్త రెసిపీ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ అవాక్కవుతున్నారు. సాధారణంగా మోమోస్ ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఢిల్లీ వీధుల్లో మామోస్ ని అమ్మవాళ్ళు ఎక్కువే. అయితే ఈ ముమోస్ మాత్రం వెరైటీగా ఉన్నాయి. సాధారణ మోమోస్ కాదు ఇవి. మ్యాంగో మోమోస్. నెట్టింట ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒక ఫుడ్ బ్లాగర్ ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసారు. దీన్ని చూసి కూడా అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. ఏంటి ఇలా కూడా తింటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బ్లాగర్ మామోస్ ని అమ్మే వ్యక్తిని ఎలా ఈ ఐడియా వచ్చింది అని ప్రశ్నించగా మ్యాంగో ఆమ్లెట్స్ ని చూసి నాకు ఈ మోమోస్ చేయాలని అనిపించింది అని అతను చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Made For Foodie (@madeforfoodie)

కూరగాయలు, మామిడి పండ్లు, చీజ్, క్రీమ్, కొన్ని స్పైసెస్, కారం తో ఒక సాస్ తయారు చేసి ఒక ప్రాసెస్డ్ మ్యాంగో డ్రింక్ తో వీటిని తయారు చేసి సేల్ చేస్తున్నారు. మ్యాంగో మోమోస్ ఒక ప్లేట్ ధర వచ్చేసి 200 రూపాయలు. పైగా దీని రుచి కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీని ట్రై చేయాలని అనుకుంటున్నారా..?

Read more RELATED
Recommended to you

Latest news