Viral : కూతురి తలపై సీసీ కెమెరా అమర్చిన తండ్రి..!

-

సాధారణంగా మనం సీసీ కెమెరాలను మన ఇంట్లో లేదా ఇంటి బయట, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటాం. ఒకవేళ ఏదైనా ఆఫీస్, కార్యాలయాల వంటి వాటిలో, షాపింగ్ మాల్స్, బస్టాండ్స్, థియేటర్ వంటి ప్లేస్ లలో సీసీ కెమెరాలు ఉంటుండటం మనం చూస్తుంటాం. కానీ ఒక చోట విచిత్రంగా ఓ తండ్రి తన కూతురు తలపై సీసీ కెమెరాలను అమర్చి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఇది ఎక్కడంటే.. పాకిస్తాన్ లో చోటు చేసుకుంది ఈ వింత ఘటన.

తన తలపై సీసీ కెమెరాను తన తండ్రే స్వయంగా అమర్చాడని ఆ బాలిక వెల్లడించింది. దానికి కారణం ఇటీవల కరాచీలో ఓ హిట్ అండ్ రన్ కేసు సంచలనం సృష్టించింది. అలాగే తనను కూడా ఎవరైనా యాక్సిడెంట్ లో చంపితే కనీసం సాక్ష్యం అయినా ఉంటుందని తన తండ్రి ఇలా తన తలకు సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది ఆ బాలిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాపం ఆ బాలిక కెమెరాను ఎన్నేళ్లు మోస్తుందోనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news