ఇంత వరకు ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి బ్లాస్ట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భారీ పేలుడుకు సంబంధించిన భయానక వీడియో వైరల్ గా మారుతుంది. అకస్మాత్తుగా సిలిండర్ లీక్ అవగానే ఓ మహిళ సిలిండర్ ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది.

అప్పటికే గ్యాస్ పూర్తిగా లీకైన తర్వాత ఓ మహిళతో పాటు మరో యువకుడు దానిని సరి చేయడానికి ఇంట్లోకి వెళ్లారు. వీరిద్దరూ ఇంట్లోకి వెళ్లిన వెంటనే కిచెన్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి ఊహించిన విధంగా బ్లాస్ట్ అయింది.
దీంతో వెంటనే వారిద్దరూ ఇంట్లో నుంచి చెరొక వైపు పరుగులు పెట్టారు. ఇదంతా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ ఘటన ఎక్కడ జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గ్యాస్ సిలిండర్ లీకై, భారీ పేలుడు సంభవించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది. అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కాగానే ఓ మహిళ సిలిండర్ను బయటకు తెచ్చేందుకు విఫలయత్నం చేసింది. గ్యాస్ పూర్తిగా లీకైన తర్వాత ఆమెతోపాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు. కిచెన్ నుంచి… pic.twitter.com/s38HDCcS2T
— ChotaNews App (@ChotaNewsApp) June 23, 2025