తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం కాలేశ్వరం, బనకచర్ల అలాగే ఫోన్ టాపింగ్ చుట్టే తిరుగుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ వద్ద ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి పోస్టర్ పెట్టి… సరికొత్త వివాదానికి తెర లేపారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు.

గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కామపిశాచి అంటూ తెలంగాణ భవన్ వద్ద ప్లెక్సీ ని ఏర్పాటు చేశారు. కెసిఆర్ సారు గిరిజన మహిళలను శారీరకంగా వేధిస్తున్న మీ పార్టీ వాళ్లను… వెంటనే సస్పెండ్ చేయండి అంటూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు… గుర్తుతెలియని వ్యక్తులు ఈ తతంగం నడిపించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తెలంగాణ భవన్ వద్ద ఫ్లెక్సీ కలకలం
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కామపిశాచి అంటూ తెలంగాణ భవన్ వద్ద ఫ్లెక్సీ వెలిసింది. 'కేసీఆర్ సారూ గిరిజన మహిళలను లైంగికంగా వేధిస్తున్న మీ వాళ్లను పార్టీలో నుండి సస్పెండ్ చేయండి' అంటూ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు… pic.twitter.com/F9fOUD9XAk
— ChotaNews App (@ChotaNewsApp) June 24, 2025