చాలా శాతం మంది ఫిట్నెస్ కోసం జిమ్‌కు వెళ్తూ ఉంటారు. జిమ్‌లో బరువులు ఎత్తే వ్యాయామాలను చేయడం వలన కండరాలు మరియు ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇటువంటి వ్యాయామాలను జిమ్ లో చేయడం వలన ఎక్కువకాలం జీవించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే దానికి కారణం మజిల్ మాస్. ఎప్పుడైతే మజిల్ మాస్‌ను కాపాడుకుంటారో, ఎక్కువ కాలం జీవిస్తారు. కాకపోతే సరైన ట్రైనర్ ను ఎంపిక చేసుకుని వ్యాయామాలను చేయాలి. ఇలా చేయడం వలన ఎక్కువ కాలం జీవించడంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
చాలా శాతం మంది ఫిట్నెస్ కోసం కండరాలను పెంచుకుంటూ ఉంటారు. కాకపోతే, దీని వలన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంది. వయస్సు పెరిగే కొద్దీ స్త్రీలు మరియు పురుషులు కూడా మజిల్ మాస్‌ను కోల్పోతూ ఉంటారు. అందువల్ల వృద్ధాప్యంలో ఎంతో బలహీనంగా మారుతారు. ఎప్పుడైతే మజిల్ మాస్ ను పెంచుకుంటారో, ఎక్కువ కాలం జీవిస్తారు. పైగా వృద్ధాప్యంలో కూడా ఎంతో దృఢంగా ఉంటారు. పైగా వయస్సు పెరిగే కొద్దీ మెట్లు ఎక్కడం, దిగడం వంటివి కష్టమవుతూ ఉంటాయి. ఈ వ్యాయామాలు చేస్తే అటువంటి సమయంలో కూడా ఎంతో సులభంగా జీవిస్తారు. కనుక మజిల్ మాస్ ను కాపాడుకోవడం ఎంతో అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా, ఇలా చేయడం వలన శరీరంలో గ్లూకోస్ కు ఎంతో మేలు చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈ వ్యాయామాలను చేయడం వలన గ్లూకోస్ స్థాయిలు ఇన్సులిన్ రెసిస్టన్స్ కు సహాయం చేస్తాయి. ఈ విధంగా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు మరియు ఎన్నో ప్రమాదకరమైన సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. కనుక మజిల్ మాస్‌ను కాపాడుకోవడానికి తప్పకుండా వ్యాయామాలను చేయండి. ఈ విధంగా ఎటువంటి గాయాలు లేకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకొని మజిల్ మాస్‌ను పెంచుకుంటూ ఉండాలి. దీంతోపాటు సరైన మోతాదులో ప్రోటీన్‌ను కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది.