చాలా శాతం మంది అనారోగ్య సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నడుము నొప్పి వంటి వాటిని నిర్లక్ష్యం చేయడం ఎంతో ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, అలసట వలన మెడ మరియు నడుము భాగాలలో నొప్పి రావడం సహజం. అయితే అటువంటి నడుము నొప్పిని తేలిగ్గా తీసుకోవడం వలన వెన్నెముక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటున్నారు. అటువంటి సందర్భాలలో నడుము నొప్పి ఎంతో సాధారణంగా వస్తూ ఉంటుంది. చాలా శాతం మంది నడుము, మెడ నొప్పులు ఎదురైనప్పుడు క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి చేస్తూ ఉంటారు.
కాకపోతే నడుము నొప్పి ఎంతో తీవ్రంగా వస్తూ ఉంటుంది. పూర్తి ఆరోగ్యానికి వెన్నెముక ఆరోగ్యం ఎంతో అవసరం. కోవిడ్ తర్వాత అందరూ ఇంట్లో ఉండి పని చేయడం వలన మరియు శారీరకంగా ఎక్కువ కష్టపడకపోవడం వలన నడుము మరియు మెడ నొప్పికి సంబంధించిన సమస్యలు ఎక్కువయ్యాయి అని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని నిర్లక్ష్యం చేయడం వలన శస్త్ర చికిత్స కూడా చేయాల్సి వస్తుంది. కనుక తగిన జాగ్రత్తలను వెంటనే తీసుకోవాలి. వెన్నెముకకు ఏదైనా గాయం అయినా లేక ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అయితే సరైన పోషకాహారాన్ని తీసుకోవడం వలన వెన్నెముక ఆరోగ్యం బాగుంటుంది.
శరీరంలో విటమిన్ డి3 లోపాలు ఎదురైనప్పుడు ఎముకలు, కండరాలు బలహీనంగా మారుతాయి. కనుక ఇటువంటి విటమిన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే, పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకొని వెన్నెముక మరియు చేతులకు సపోర్ట్ ఇచ్చే కుర్చీని ఉపయోగించడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముక ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వెన్నెముకకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేస్తే సమస్య ఎంతో తీవ్రమవుతుంది. కదలడం కూడా కష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక వెన్నెముకకు సంబంధించిన చికిత్సను అసలు నిర్లక్ష్యం చేయకూడదు.