హైదరాబాద్‌లో వర్షం పడుతునే ఉంది. హైదరాబాద్ లో ఎప్పుడు చూసినా ఆకాశం నల్లగానే ఉంటోంది. హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి కురుస్తున్నాయి వర్షాలు. ఈ రోజు ఉదయం సైతం మేఘావృతమై.. చల్లగాలులు వీస్తున్నాయి. ఇవాళ సాయంత్రం వర్షం మరోసారి పడనుంది.

తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలలో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు సూచనలు జారీ చేశారు.