ఏపీలో రేపు ప్రైవేట్ పాఠశాలలు బంద్. కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరిట వేధిస్తున్నందువల్ల రేపు అన్ని ప్రైవేట్ స్కూళ్లు బంద్ చేసి నిరసన తెలపనున్నట్లు యాజమాన్యాల అసోసియేషన్ స్పష్టం చేసింది. సరిగ్గా పరిశీలించకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా 55% కన్నా ఎక్కువ మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరోవైపు స్కూళ్లు ప్రారంభమై నెల రోజులు కూడా పూర్తికాకముందే ఇలా స్కూళ్లు బంద్ చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాగా మరోవైపు ఏపీ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు ఎక్కువగా కొలిచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.