ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్ద ఉద్రిక్తత

-

ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ – ఎన్టీఆర్ వర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న మెడికో విద్యార్థులను ఈడ్చేపడేశారు పోలీసులు. ధర్నా చేస్తున్న మెడికల్ స్టూడెంట్ ను అరెస్ట్ చేసారు పోలీసులు.. మహిళలని కూడా చూడకుండా లాగి పడేసారు పోలీసులు.

Vijayawada - Police drag away protesting medico students at NTR University
Vijayawada – Police drag away protesting medico students at NTR University

తోపులాటలో మహిళా విద్యార్థినులను పోలీసులు కడుపులో తొక్కారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా, స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మెడికోలు నిరసనలు తెలుపుతున్నారు.

తాను ఉన్నంత వరకు విద్యార్థులను పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయనని అంటున్నారు APMC రిజిస్టర్ ఐ.రమేష్. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ను 6 నెలల క్రితం కలిసి రెప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని మెడికోల ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ, మగ అని తేడా లేకుండా అందరిని అరెస్ట్‌ చేసి.. ఈడ్చుకెళ్లి ట్రక్కుల్లో వేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news