ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్.. తన ఇద్దరు కొడుకులతో మెరిశారు. ఏపీలోని ఓ ఎయిర్ పోర్టు దగ్గర… తన ఇద్దరు కొడుకులతో కనిపించారు. తన పెద్ద కుమారుడు అకిరా నందన్ అలాగే చిన్న కుమారుడు మార్పు శంకర తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… సరదాగా కనిపించారు. ముగ్గురు హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులను తీసుకు వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయంలో ముగ్గురు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా సింగపూర్ లో చదువుతున్న మార్కు శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆయన చిన్న కుమారుడు మార్కు శంకర్ బయటికి రావడం ఇదే తొలిసారి.