హైదరాబాద్ మహానగరంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి జేబులోనే మొబైల్ ఫోన్ పేలింది. పాయింట్ జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్… బాగా వేడెక్కి పేలినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన హైదరాబాదులోని అత్తాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాధిత యువకుడి తొడ అలాగే కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతని ఆసుపత్రికి తరలించారు స్థానికులు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడి

యో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా జనాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా మొబైల్ ఫోన్స్ వాడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయానికి మొబైల్ ఫోన్ వాడక తప్పడం లేదు. పేద ధనిక అలాగే చిన్న పెద్ద అనే తేడా లేకుండా… ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ ఫోన్ వాడుతున్నారు. విపరీతంగా మొబైల్ ఫోన్ వాడడం వల్ల అది వేడెక్కి పేలుతోందని అంటున్నారు.
ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్
యువకుడి తొడ, కాలికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఘటన pic.twitter.com/9BNAQbmx6R
— BIG TV Breaking News (@bigtvtelugu) July 4, 2025