ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గేదెలకు పాలు పిండటం తెచ్చింది నేనేనంటూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు బాబు. దీంతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడిన… హైదరాబాద్ డెవలప్మెంట్ తానే చేశానని.. ఇండస్ట్రీలు కూడా తీసుకువచ్చానని చెబుతూ ఉంటారు.

అలాగే ఇటీవల నోట్ల రద్దు చేయాలని కూడా మోడీ ప్రభుత్వాన్ని… రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజావేదికలో మాట్లాడుతూ గేదెలకు పాలు పిండటం తెచ్చింది నేనేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం ఐదు అయితే చాలు అందరూ ఇంటికి చేరుకొని పాలు పెడతారని కూడా వెల్లడించారు. ఇక ఈ వీడియో పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
గేదెలకు పాలు పిండటం తెచ్చింది నేనే
– సీఎం చంద్రబాబు #AndhraPradesh #CMChandrababu pic.twitter.com/3vhe9TfRy9
— Telugu Feed (@Telugufeedsite) July 6, 2025