‘ఆంధ్ర జ్యోతి’ని ‘తెలంగాణ జ్యోతి’ గా మార్చుకో… RS ప్రవీణ్ కుమార్ వార్నింగ్

-

‘ఆంధ్ర జ్యోతి’ని ‘తెలంగాణ జ్యోతి’ గా మార్చుకో…అంటూ ABN RKకు RS ప్రవీణ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ‘ఆంధ్ర జ్యోతి’ దినపత్రిక ‘తెలంగాణ జ్యోతి’ గా పేరు మార్చుకోకుండా తెలంగాణ లో ఇంకా సర్కులేట్ ఐతనే ఉన్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల కష్టార్జితం అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోపిడికి గురైతూనే ఉన్నదని చురకలు అంటించారు.

rs praveen kumar
rs praveen kumar

విశాలాంధ్ర మన తెలంగాణ గా, ప్రజాశక్తి నవ తెలంగాణ గా తొలినాళ్లలో నే పేరు మార్చుకున్నట్లున్నదని గుర్తు చేశారు. ఇట్లా పేరు మార్చుకోకుండా వలసవాద భావాలను బలవంతంగా ప్రజలపై రుద్ది, ఆంధ్ర పాలకుల తొత్తులకు దన్నుగా నిలిచే ఆంధ్ర మూలాలున్న దిన పత్రిక/టీవీ చానల్లను తెలంగాణ ప్రజలు ఎందుకు చదవాలి/చూడాలి?? ఒక్క సారి ఆలోచించండి అని నిలదీశారు. కాగా తెలంగాణ మీ జాగీరా అంటూ గులాబీ పార్టీని ఉద్దేశించి ABN RK ప్రత్యేక కథనం వేశారు. అయితే దానికి RS ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news