ఏపీ విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. విద్యార్థులు స్కూళ్లకు మూడు రోజులకు మించి రాకపోయినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి స్కూళ్లకు వచ్చేలా చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల లోపు నుంచి ఎక్కువగా బడికి రాకపోతే MEO, CRPలు విద్యార్థుల ఇంటికి వెళ్లాలని స్పష్టం చేశారు. టీచర్లు విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వెల్లడించారు.

టీచర్లు ఒకవేళ సెలవులు పెట్టినట్లయితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. ఇకనుంచి విద్యార్థులపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా… ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవుల పైన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమిచ్చే ఆప్షన్స్ కేవలం ఉపాధ్యాయులకు మాత్రమేనని అన్నారు. విద్యార్థులకు ఆప్షనల్ సెలవులు ఉండవని స్పష్టం చేశారు.