హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరించారు. రాధాకృష్ణ తొలిపలుకు కథనం, బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసులు భద్రత కల్పించారు.

ఏబీఎన్ ముందు 70 మంది, ఆంధ్రజ్యోతి ముందు 50 బెటాలియన్ పోలీసులతో భద్రత కల్పించారు. తాజాగా గులాబీ పార్టీని ఉద్దేశించి ఆంధ్రజ్యోతి పత్రికా అలాగే ఏబీఎన్ ఛానల్ లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. తెలంగాణ అంటే గులాబీ పార్టీ జాగిరా ? అనే శీర్షిక పెట్టు మరి… రాధాకృష్ణ ప్రత్యేక ఆర్టికల్ రాశారు. దీంతో ఈ ఆర్టికల్ ను ఉద్దేశించి కౌంటర్ ఇస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. అంతేకాదు ఇవాళ ఆంధ్రజ్యోతి ముట్టడికి కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఛానల్ దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరింపు
రాధాకృష్ణ తొలిపలుకు కథనం, బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసుల భద్రత
ఏబీఎన్ ముందు 70 మంది, ఆంధ్రజ్యోతి ముందు 50 బెటాలియన్ పోలీసులతో భద్రత pic.twitter.com/gwjWqLNXfS
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025