ప్రెస్ క్లబ్‌ వద్ద హై టెన్షన్.. సవాల్ విసిరితే ఢిల్లీకి రేవంత్ వెళ్లాడని కేటీఆర్ ఫైర్

-

సవాల్ విసిరితే ఢిల్లీకి రేవంత్ వెళ్లాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్.. మరికాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వెళ్లనున్నారు. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తూ చర్చకు రావాలని తాను విసిరిన ప్రతిసవాల్ నేపథ్యంలో..బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరనున్నారు కేటీఆర్.

ktr
KTR arrives at Telangana Bhavan and soon at Somajiguda Press Club

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… కొడంగల్‌లో ఇంతవరకు రైతుబంధు పడని 670 మంది జాబితాతో సహా ప్రెస్‌క్లబ్‌కు చర్చకు వెళ్తున్నానన్నారు. రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద చర్చించడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరుతున్నామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వస్తాడు అనుకుంటే నిన్ననే బయలుదేరి ఢిల్లీకి వెళ్లాడని చురకలు అంటించారు.. మరి చర్చకు ముఖ్యమంత్రి బదులు వ్యవసాయ మంత్రి వస్తాడా, ఉపముఖ్యమంత్రి వస్తాడా, లేదా ఇంకా ఎవరైనా మంత్రి వస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉంటాము అన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news