కాచిగూడ – యశ్వంత్ పూర్ మధ్యాహ్నం రైలు బోగీల సంఖ్య పెరగనుందని రైల్వే శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7 చైర్ కార్, ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ తో ఎనిమిది భోగిలు ఉండగా… ఈనెల 10వ తేదీ నుంచి 14CC, 2EC కోచ్ లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1128కి భారీగా పెరగనుంది. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బుధవారం మినహా ప్రతిరోజు ఈ రైలు ఉదయం 5:45 కు కాచిగూడలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ అలాగే మధ్యాహ్నం 2: 45కు బయలుదేరి రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అతి తక్కువ సమయంలోనే ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వందే భారత్ ట్రైన్లలో టికెట్ చార్జీలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ క్షేమంగా తొందరగా వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ప్రయాణికులు వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.