ఇవాళ చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన..500 మందికే అనుమతి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఇవాళ చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను ఈ సందర్భంగా పరామర్శించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.

Jagan's visit to Chittoor district today only 500 people allowed
Jagan’s visit to Chittoor district today only 500 people allowed

రైతులతో సమావేశమై వారి సమస్యలను కూడా ఈ సందర్భంగా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. హెలికాప్టర్లో ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత కొత్తపల్లికి రాబోతున్నారు. తెలిపాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డులో జగన్ తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news