మాజీ జగన్ మోహన్ రెడ్డి టూర్‌కు జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామనిహెచ్చరించారు ఎస్పీ మణికంఠ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఇవాళ చిత్తూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి రైతులను ఈ సందర్భంగా పరామర్శించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.

రైతులతో సమావేశమై వారి సమస్యలను కూడా ఈ సందర్భంగా తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. హెలికాప్టర్లో ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత కొత్తపల్లికి రాబోతున్నారు. తెలిపాడ్ వద్ద 30 మంది, మార్కెట్ యార్డులో జగన్ తో పాటు 500 మంది మాత్రమే ఉండాలని పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఎస్పీ మణికంఠ మాట్లాడారు. ఇది కేవలం రైతులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం మాత్రమే.. పబ్లిక్ మీటింగ్ కాదు… హెలిప్యాడ్ వద్దకు 30 మందిని, రైతుల పరామర్శ కార్యక్రమానికి 500 మందిని అనుమతిస్తున్నామని వెల్లడించారు ఎస్పీ మణికంఠ.