కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

-

పోలీస్ స్టేషన్‌లో కోడి పంచాయితీ తెరపైకి వచ్చింది. కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టాడు రాకేష్ అనే వ్యక్తి.

Woman files police complaint against chicken for beating
Woman files police complaint against chicken for beating

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ… నానా రచ్చ చేసింది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, రాకేష్‌కు శిక్ష పడాల్సిందేనంటూ పట్టుబట్టింది గంగమ్మ. ఈ కోడి పంచాయితీ ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news