సీఎం చంద్రబాబు నాయుడుపై హాట్ కామెంట్స్ చేశారు ఏపీ మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి. వివరాల్లోకి వెళితే… మామిడి రైతులు సీఎం చంద్రబాబుకు, ఆయనకు సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ వారికి దొంగలు, రౌడీలలాగా కనిపిస్తున్నారా అంటూ మాజీ సీఎం జగన్ నిలదీశారు. రైతులకు అండగా నిలవక పోగా వారిపై వెకిలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి కొంచమైనా సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాలను గాలికి వదిలేసారు అంటూ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా మీరు మీ పద్ధతిని మార్చుకొని రైతులకు అండగా నిలబడండి అంటూ ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన సీఎం చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.