తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య.. రూ.40 కోట్లు మనీ ల్యాండరింగ్ !

-

తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.40 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసు నేపథ్యంలో తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై-మాధవరంలోని తిరుమల డెయిరీలో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు ఏపీ-విశాఖపట్నానికి చెందిన నవీన్ బొలినేని(37). తిరుమల మిల్క్ డెయిరీలో రూ.40 కోట్ల మేర మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు.

Tirumala Milk Dairy Manager Naveen Bollineni commits suicide
Tirumala Milk Dairy Manager Naveen Bollineni commits suicide

దీనిపై విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు పోలీసులు. ఈ క్రమంలో విచారణకు హాజరు కాకుండానే చెన్నై-బ్రిటానియానగర్‌లోని తనకు చెందిన షెడ్‌లో ఉరి వేసుకుని నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరెస్ట్ భయంతోనే నవీన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై తల్లికి, స్నేహితులకు, బంధువులకు నవీన్ ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news