గోషామహల్లో రాజాసింగ్ కంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లు దొరకలేదా అంటూ రాజాసింగ్ నన్ను అవహేళన చేశాడఐ మండిపడ్డారు బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత.

జూబ్లీహిల్స్ గోషా మహాల్ లో ఎక్కడ బైపోల్ వచ్చినా టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని బిజెపి నేత మాధవి లత అన్నారు. రాజాసింగ్ రాజీనామాను భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. పార్టీలో సహకారం లేదని రాజాసింగ్ అన్నారు. మరి నాకు ఎందుకు ఆయన సహకరించలేదు.
పార్టీనే కదా కార్పొరేటర్ ను తెచ్చి ఎమ్మెల్యేలను చేసింది. మహిళలను అమర్యాదగా మాట్లాడడం, వేరే మతాలను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టడం సనాతన ధర్మం కాదని మాధవి లత సంచలన కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా…. ఇటీవల బీజేపీ పార్టీకి ఇటీవల రాజీనామా చేశాడు. దీంతో బీజేపీ పార్టీ రాజీనామాను ఆమోదించింది. దీంతో రాజా సింగ్ కు బిజెపి పార్టీతో బంధం తెగిపోయింది. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారాలు సాగుతున్నాయి. మరి అతను ఏ పార్టీలోకి చేరుతారు అనేది తెలియాల్సి ఉంది.