ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాలలో అతి త్వరలోనే 2000 రూపాయలు జమ చేయబోతోంది మోడీ ప్రభుత్వం. పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇవాళ బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఏడాదికి… మూడు విడుదలలో 2000 చొప్పున 6000 రూపాయలు జమ చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ డబ్బులు డిపాజిట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది..