గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. జీవితంలో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేయని చురకలు అంటించారు. మళ్లీ అమెరికా వెళ్లి బేసిన్లు తోముకోవాల్సిందే అంటూ కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. సిరిసిల్లలో కేటీఆర్ ను చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు.

మా కార్యకర్తల జోలికి వస్తే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇళ్లపై దాడి చేస్తామని కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు మైనంపల్లి హనుమంతరావు. నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గ గులాబీ పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మైనంపల్లి… కుటుంబంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. గుండాలతో వచ్చి మల్కాజిగిరి రోడ్లపై.. రెచ్చిపోయిన వాళ్ల అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు మైనంపల్లి కౌంటర్ ఇచ్చాడు.