కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు బిగ్ షాక్ !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై రైతులు తిరగబడ్డారు. గంధమల్ల ప్రాజెక్టు కోసం మార్కెట్ రేటుకు సగం డబ్బులు ఇచ్చి భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎం.తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులతో గంధమల్ల ప్రాజెక్టు భూసేకరణపై అనధికారిక సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు.

Big shock for Congress MLA Beerla Ilayya
Big shock for Congress MLA Beerla Ilayya

మార్కెట్లో కోటి రూపాయలు ఉన్న ఎకరా భూమికి కేవలం రూ.47 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని తెలిపింది ప్రభుత్వం. ఇప్పుడు అవి కూడా ఇవ్వనని కేవలం రూ.24.50 లక్షలు మాత్రమే ఇస్తానని బీర్ల ఐలయ్య తమను బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు రైతులు.

ఎలాంటి గెజెట్ విడుదల చేయకుండా, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు చేయడం ఏంటని, సమావేశంలో వీడియోలు తీయడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తిరగబడ్డారు 200 మంది వీరారెడ్డిపల్లి రైతులు.

Read more RELATED
Recommended to you

Latest news