వైసిపి నేతలకు శుభవార్త.. ఆ పోస్టులు భర్తీ చేశారు జగన్. వైసీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం చేశారు వైస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ.

ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా.. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కూడా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో నిన్న సిట్ ప్రిలిమినరీ చార్జి షీట్ దాఖలు. అందులో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు పలు చోట్ల ప్రస్తావించినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి.