రెండు దశాబ్దాల పాటు కోమాలో ఉన్న సౌదీ ప్రిన్స్ అల్వాలీద్ ఇవాళ మృతి చెందారు. 2005లో లండన్ లో జరిగిన యాక్సిడెంట్ తో ఖలీద్ కోమాలోకి వెళ్లారు. దాంతో డాక్టర్లు బతకడం కష్టమని చెప్పినప్పటికీ ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనన్న ఆశతో ఆయన తండ్రి వైద్యం చేయమని డాక్టర్లను బ్రతిమిలాడుకున్నారు.

కాగా ప్రిన్స్ కోలుకోవాలని అనేక రకాల ప్రార్థనలు చేశారు. సోషల్ మీడియాలో సైతం పలువురు క్యాంపెయిన్ నిర్వహించారు. అప్పటినుంచి స్లీపింగ్ ప్రిన్స్ గా ఇతడికి పేరు వచ్చింది. ఖలీద్ మరణంతో అతని తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏదో ఒక రోజు నా కొడుకు బతుకుతాడు అన్న ఆశతో ఎదురు చూశానని ఇలా మరణిస్తాడని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.