ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బత్తాయి కాయల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా మార్కెట్ యార్డులో శుక్రవారం, శనివారాలలో టన్ను బత్తాయి కాయల ధర రూ. 18,000 పలుకగా, ఈరోజు రూ. 15,000కు పడిపోయింది. దీంతో కేవలం ఒక్క రోజులోనే ఇంత వ్యత్యాసం ఏంటని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

టన్ను బత్తాయి కాయలు రూ. 20,000 రాకపోతే పూర్తిగా నష్టపోతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయం పైన వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. బత్తాయి కాయలకు తగిన ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పంట దిగుబడి పెరగడం వల్ల మార్కెట్లో డిమాండ్, ధర పూర్తిగా తగ్గాయి.