ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని స్మోకింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఎవరైనా పట్టించుకుంటారా చెప్పండి..! చేసేది చెడ్డ పనే కానీ దాన్ని మరీ చెడ్డ సమయంలో చేయడం వల్ల ఆరోగ్యం ఇంకా పాడవుతుంది..! అర్థం కాలేదా..! స్మోకింగ్ చేయడానికి కూడా పర్టిక్యులర్‌గా ఒక టైమ్ ఉంటుంది.. అలానే చేయకపోవడానికి కూడా ఉంటుంది. కొంతమంది ఉదయం లేవగానే.. ఒక దమ్ము వేస్తారు. అప్పుడే వాళ్లకు రోజు ఫ్రష్‌గా స్టాట్ అయినట్లు ఉంటుంది.! కానీ ఉదయం పూట ధూమపానం చేయడం వల్ల నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
చాలా మంది వ్యక్తులు నిద్రలేచిన వెంటనే లేదా అల్పాహారం తీసుకున్న వెంటనే, ఆఫీసు పనిని ప్రారంభించే ముందు పొగ తాగుతారు. ఈ హ్యాబిట్ ప్రాణాంతకం మరియు అత్యంత ప్రమాదకరమైనది, ముఖ్యంగా యువత ఆరోగ్యాన్ని ఘోరంగా పాడుచేస్తుంది.
ఉదయాన్నే సిగరెట్ తాగడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?
ఉదయాన్నే పొగతాగడం వల్ల నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు. నిద్రలేచిన వెంటనే సిగరెట్ తాగే స్మోకర్లు రోజుకు ఎన్ని సిగరెట్లు తాగినా పొగతాగుతూనే ఉంటారు. మధ్యాహ్నం, సాయంత్రం ధూమపానం చేసేవారితో పోలిస్తే.. ఉదయం పొగతాగే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది.
ఏది ప్రేరేపిస్తుంది?
ధూమపానానికి అలవాటు పడిన చాలా మంది రాత్రిపూట ధూమపానం చేస్తారు. ఉదయం నిద్రలేవగానే వారి రక్తంలో నికోటిన్ స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. వారి న్యూరో రిసెప్టర్లు ధూమపానం కోరికను కలిగించేలా ప్రేరేపిస్తాయి.
ఇలా చేయండి..!
మద్యపానం కంటే… స్మోకింగ్ చాలా ప్రమాదం. ఇది ఊపరితిత్తులను చాలా త్వరగా పాడుచేస్తుంది. సిగిరెట్ మానేయడానికి ప్రయత్నించండి. మీరు స్మోకింగ్ వదిలేయాలని అనుకున్నా.. అది మీతో సాధ్యం కావడం లేదంటే.. కొన్ని టిప్స్ పాటించండి. జేబులో లేదా బ్యాగ్‌లో సిగరెట్లు లేదా లైటర్‌లను తీసేయండి. స్మోకింగ్ మానేస్తున్నా అని మీ స్నేహితులకు చెప్పేయండి. మీరు మళ్లీ తాగినా.. వాళ్లకు చెప్పేశామే అన్న ఆలోచనతో కాస్తైనా ఈ అలవాటు మార్చుకోవచ్చు. మీరు ఉదయం లేవగానే సిగరెట్ తాగడం మీ మొదటి అలవాటు అయితే, దానిని ఒక గ్లాసు నీటితో భర్తీ చేయండి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఉదయం ఒక గ్లాస్ వాటర్ తాగితే.. మీ ఆరోగ్యానికి చాలా మంచిది.