బాలీవుడ్ నటుడి పై చెప్పుతో దాడి చేసిన నటి

-

నటి రుచి గుజ్జర్, సినీ నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై  మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఎస్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసు ఒక హిందీ టెలివిజన్ సీరియల్ సహ-నిర్మాణానికి సంబంధించిన 724 లక్షల ఆర్థిక వివాదం చుట్టూ తిరుగుతుంది.
ఎఫ్ఎస్ఐఆర్ ప్రకారం.. జూలై 2023 నుంచి జనవరి 2024 మధ్య కాలంలో  రుచి తన సంస్థ ఎస్ఆర్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ నుండి డబ్బును కరణ్ కంపెనీ కె స్టూడియో కి  కు అనుసంధానించబడిన వివిధ ఖాతాలకు బహుళ వాయిదాలలో బదిలీ చేశాడని ఆరోపించింది.

ruchi

చౌహాన్ సోనీ టీవీలో ఒక హిందీ సీరియల్ ని ప్రారంభిస్తున్నానని.. దానికి సహ నిర్మాత పాత్రకు తనకు ఆఫర్ చేశాడని రుచి పేర్కొంది. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ కరణ్ సింగ్ చౌహన్ పై నటి రుచి గుజ్జర్ చెప్పుతో దాడి చేశారు. ముంబై లోని ఓ థియేటర్ లో సో లాంగ్ వ్యాలీ మూవీ స్క్రీనింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీరియల్ నిర్మాణం కోసం గతంలో అతను తన నుంచి రూ.24లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆమె అతని పై చెప్పుతో దాడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news