ప్రస్తుతము మనం గడుపుతున్న ఈ బిజీ లైఫ్ లో,ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ చూస్తూ, ఫోన్ చూస్తూ గడపడం వల్ల, శరీరంలో వాటర్ పర్సంటేజ్ తగ్గి డిహైడ్రైజేషన్ అవుతూ ఉంటాం. అయితే ఇది ఎండాకాలం మాత్రమే కలుగుతుంది అని కొందరు అపోహ పడతారు. వానాకాలంలోనూ డిహైడ్రైజేషన్ అవడం కొందరిలో మనం చూస్తాం. అలాంటి టైంలో మనం మజ్జిగని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలం ప్రారంభం అవ్వగానే సీజనల్ వ్యాధులు అంటే జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు అనేవి మనకి ప్రస్తుతం తలెత్తుతున్నాయి ఈ కాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం వలన జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు అయితే వర్షాకాలంలో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అని చాలామంది సందేహ పడుతుంటారు కానీ ఆరోగ్య నిపుణులు సలహా ప్రకారం మజ్జిగ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం..
మనం రోజు ఉపయోగించే ఆహారంలో మజ్జిగని చేర్చుకోవడం అందరికీ తెలిసిందే కానీ మనం పరగడుపున మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం సమయంలో మజ్జిగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని ఇస్తాయి పరగడుపున తాగడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉంటాము.
మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, జీన క్రియను మెరుగుపరుస్తుంది ఉదయం మజ్జిగ తాగితే పొట్టలో బరువు తగ్గుతుంది రోజంతా జీర్ణ శక్తి మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేస్ ప్రోటీన్లు ఇతర పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయం ఉండే బద్ధకం అలసట తగ్గించి చురుకుదనాన్ని ఇస్తుంది. మజ్జిగలోని నీరు ఎలక్ట్రోలైట్స్, వలన శరీరంను హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఉదయం హైడ్రేషన్ శరీరానికి శక్తిని ఇవ్వడంలో కీలక పాత్రను వహిస్తుంది.
ఇక అలాగే మజ్జిగలో బి విటమిన్లు,క్యాల్షియం ఇతర పోషకాలు ఉండడం వల్ల శరీరం రోజువారి శక్తి ఇచ్చి మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. అలాగే పరగడుపున మజ్జిగలో ఉప్పు లేదా జీలకర్ర, కొత్తిమీర,కరివేపాకు వంటివి రుచికి తగినట్టుగా వేసుకొని తాగడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎక్కువగా చల్లగా ఉన్న మజ్జిగ ఉదయం తాగితే జలుబు గొంతు సమస్యలు రావచ్చు కొద్దిగా గది ఉష్ణోగ్రతను బట్టి మజ్జిగను తాగడం ఉత్తమం.కొందరికి పాల ఉత్పత్తులపై ఎలర్జీ లాక్టోసిస్ ఇంటలెరెన్స్ ఉంటే మజ్జిగ తాగడం మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.