Anchor Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. అందులో అనసూయ ఒకరు. యాంకర్ గా పరిచయమైన అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూ కూడా మంచి పేరు తెచ్చుకుంటోంది అనసూయ.

కాగా తాను సోషల్ మీడియాలో ఇప్పటి వరకు 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్లు నటి అనసూయ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో.. ‘సోషల్ మీడియాలో కొన్నిసార్లు నెటిజన్ల కామెంట్లు భరించలేకపోయా. కొన్నింటికి రియాక్ట్ అయ్యా.. కొన్ని కాలేకపోయా. చివరకి వారిని బ్లాక్ చేశా’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అనసూయ చేసిన కామెంట్లపై నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. 30 లక్షల మందిని బ్లాక్ చేశానని చెప్పడం నమ్మశక్యంగా లేదని అంటున్నారు.