భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగేందుకు తానే కారణం అంటూ చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ లోక్ సభలో స్పందించారు. ఏ దేశఆధినేత కూడా తనను ఆపరేషన్ సింధూర్ ముగించాలని కోరలేదని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఆయన పరోక్షంగా చెప్పినట్టు అయింది. మరోవైపు ట్రంప్ పదే పదే తానే యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పిన విషయం విధితమే.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నాయకులు ట్రంప్ చెప్పిన వ్యాఖ్యలను పార్లమెంట్ లో గుర్తు చేశారు. దీంతో ప్రధాని వారికి కౌంటర్ ఇచ్చారు. భారత్ దాడులతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని వెల్లడించాడు. మాపై దాడులు చేయకండి. తాము తీవ్రంగా నష్టపోయామని.. తట్టుకునే శక్తి మాకు లేదని.. యుద్ధం ఆపండి అని పాకిస్తాన్.. భారత DGMO కి కాల్ చేసి అడ్డుకుంది అని తెలిపారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ తనతో మాట్లాడాడు. పాక్ భారీ దాడులకు ప్లాన్ చేసిందని హెచ్చరించాడు. పాక్ ఏం చేసినా నేను చూసుకుంటానని చెప్పినట్టు గుర్తు చేశారు ప్రధాని మోడీ.