ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా టీమిండియా ప్లేయర్ అభిషేక్ శర్మ నిలిచారు. 829 పాయింట్లతో ఆయన అగ్రస్థానానికి చేరుకున్నారు. రెండో స్థానంలో ట్రావిస్ హెడ్ ఉన్నారు. తిలక్ వర్మ సూర్యకుమార్ టాప్ -10లో నిలిచారు. మరోవైపు రిషబ్ పంత్ టెస్టు ర్యాంకింగ్స్ లో ఏడో స్థానానికి చేరుకున్నారు. జైస్వాల్, గిల్ ఏడేనిమిది ప్లేసుల్లో ఉన్నారు. జడేజా టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నారు.
ఇటీవల రెండో స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ.. అగ్రస్థానంలో ట్రావిస్ హెడ్ ను క్రాస్ చేసి టాప్ ప్లేస్ లోకి వచ్చేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో టీ-20 మ్యాచ్ లో సెంచరీతో సహా ఇంగ్లాండ్ జరిగిన సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శనతో 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉండటం విశేషం.