ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం డ్రోన్స్ కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏడాదికి రూ.20వేల చొప్పున అన్నదాత సుఖీభవ ద్వారా అందజేస్తున్నాం. మూడు విడుతలుగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ న్యాయం జరగాలన్నారు. కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రధాని మోడీ ఉన్నారు. నాలుగో సారి కూడా ప్రధాని నరేంద్ర మోడీనే అని జోస్యం చెప్పారు సీఎం చంద్రబాబు. వ్యవసాయాన్ని గాడిన పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ ఇప్పుడు ఒక్క నెలకాదు.. మూడు నెలలు తీసుకోకున్నా అన్ని కలిపి మా ప్రభుత్వం అందజేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలకు అదనంగా.. మూడు విడుతలు అందజేస్తుందని తెలిపారు.