ఆపరేషన్ సింధూర్ విజయం మహిళలకు అంకితం అని భారత ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. అలాగే మహాదేవ్ పాదాలకు అంకితం చేస్తున్నానని ప్రధాని తెలిపారు. వారణాసి సభలో ఆయన ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రవాది దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. మహిళలు తమ సిందూరం కోల్పోయారు. ఆపరేషన్ సిందూర్ తరువాత తొలిసారి కాశీకి వచ్చాను. మహదేవ్ ఆశీర్వాదంతో ప్రతీకారం తీర్చుకున్నాం.. ఈ విజయాన్ని మహదేవ్ తో పాటు సిందూరం కోల్పోయిన మహిళలకు అంకితం ఇస్తున్నానని తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడితో తన హృదయం తీవ్ర దు:ఖంత నిండిపోయిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టబడి ఉందన్నారు. అన్నదాతలకు చేయూతను ఇచ్చేందుకే తాము పీఎం కిసాన్ యోజన పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశవ్యాప్తంగా వేల గోదాములను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 3 కోట్ల మంది లక్ పతి దీదీలను తయారు చేస్తున్నామని.. కానీ అసత్యాలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతలు పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.